'చార్మినార్​ వద్ద ఆ కార్యక్రమం ఏందీ.. ఆ డ్యాన్సులేందీ ?'

by Sridhar Babu |   (  Updated:2021-10-18 10:39:47  IST  )

<p>దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఏక్​షామ్​చార్మినార్​కే నామ్ పేరుతో ఆధ్యాత్మిక వాతావారణాన్ని చెడగొడుతున్నారని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తప్పు పట్టింది. ఆధ్యాత్మిక వాతావరణానికి నెలవయిన చార్మినార్​ వద్ద ఏక్​షామ్ చార్మినార్ ​కే నామ్ కార్యక్రమంతో పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని, ఆ డ్యాన్స్​లు ఏంటని ప్రశ్నించారు. సోమవారం చత్తా బజార్ లోని జమాత్ ఏ ఇస్లామి హింద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతినిధులు ఖాయ ముద్దీన్, సోహైల్ రిజవాన్, కాలేదా [&hellip;]</p>

Islamic-Org1
X

దిశ, చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద ఏక్​షామ్​చార్మినార్​కే నామ్ పేరుతో ఆధ్యాత్మిక వాతావారణాన్ని చెడగొడుతున్నారని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తప్పు పట్టింది. ఆధ్యాత్మిక వాతావరణానికి నెలవయిన చార్మినార్​ వద్ద ఏక్​షామ్ చార్మినార్ ​కే నామ్ కార్యక్రమంతో పాశ్చాత్య సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని, ఆ డ్యాన్స్​లు ఏంటని ప్రశ్నించారు. సోమవారం చత్తా బజార్ లోని జమాత్ ఏ ఇస్లామి హింద్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతినిధులు ఖాయ ముద్దీన్, సోహైల్ రిజవాన్, కాలేదా పర్వీన్, అబ్దుల్ ఖదీర్, అబ్దుల్ సమిలు మాట్లాడుతూ ఆదివారం చార్మినార్ వద్ద ఏక్​షామ్ చార్మినార్ కే నామ్ పేరుతో కార్యక్రమం నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. చార్మినార్ వద్ద చారిత్రాత్మక భాగ్యలక్ష్మి దేవాలయం, చారిత్రాత్మక మక్కా మసీదు.. దర్గాలు ఉన్నాయని, అలాంటి ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించడానికి, వ్యాపారాలు పెంచడానికి అన్నివర్గాల ప్రజల సంస్కృతి సంప్రదాయలకు విరుద్ధంగా పాశ్చాత్య సంస్కృతి వైపు దృష్టి మళ్లించడం సరికాదన్నారు.

Next Story