- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పర్యాటకులకు ముఖ్య గమనిక.. పాకాల కట్టపై వంటలు వండొద్దు
<p>దిశ, నర్సంపేట: ప్రకృతి అందాలతో, జలకలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న పాకాలలో ఆంక్షలు మొదలయ్యాయి. పాకాల కట్టపై వెలసిన మైసమ్మ దేవత వద్ద మొక్కులు తీర్చుకొని, అక్కడే భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పాకాల కట్టపై వంటలు వండటం, వనభోజనాలు చేయడాన్ని నిషేధిస్తూ వరంగల్ జిల్లా అటవీ అధికారి అర్పణా శ్యాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. బయో డైవర్సిటీ పార్క్, పాకాల నీటి స్వచ్ఛతను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. భోజన ఏర్పాట్లు […]</p>

X
దిశ, నర్సంపేట: ప్రకృతి అందాలతో, జలకలతో పర్యాటకులను ఆకర్షిస్తున్న పాకాలలో ఆంక్షలు మొదలయ్యాయి. పాకాల కట్టపై వెలసిన మైసమ్మ దేవత వద్ద మొక్కులు తీర్చుకొని, అక్కడే భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పాకాల కట్టపై వంటలు వండటం, వనభోజనాలు చేయడాన్ని నిషేధిస్తూ వరంగల్ జిల్లా అటవీ అధికారి అర్పణా శ్యాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. బయో డైవర్సిటీ పార్క్, పాకాల నీటి స్వచ్ఛతను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. భోజన ఏర్పాట్లు చేసుకునే వారు సంగెం కాలువ పక్కనున్న గుడిసెల దగ్గర, గిరక తాళ్ల దగ్గర ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
Next Story






