ఆదివాసీ ప్రాంతాల్లో బ్యాంకుల్ని మూసేయొద్దు

by  |
ఆదివాసీ ప్రాంతాల్లో బ్యాంకుల్ని మూసేయొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రజలకు వివిధ రకాల సేవలందిస్తున్న బ్యాంకర్లు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని, మరే రాష్ట్రంలోకంటే తెలంగాణలో మంచి ఫలితాలు వస్తున్నాయని, ఇదే సహకారాన్ని ఇకపైన కూడా కొనసాగించాలని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రైతులు, చిన్న తరహా పరిశ్రమల నిర్వాహకులు, స్వయం సహాయక మహిళా బృందాలు, వీధి వ్యాపారులు.. ఇలా అన్ని సెక్షన్ల ప్రజలకు ప్రభుత్వం తరఫున సబ్సిడీ, రుణాలు తదితరాలను సకాలంలో అందించినందుకు బ్యాంకర్లను అభినందించారు.

అయితే మారుమూల గ్రామాలు, ఆదివాసీ గూడేలు, గిరిజన్ల గ్రామాల్లో లాభసాటిగా లేదన్న కారణంతో కొన్ని బ్యాంకు శాఖలను మూసివేస్తున్నారని, ఆ ప్రయత్నాన్ని మానుకుని ప్రజలకు తగిన సేవలను అందించాలని బ్యాంకర్లను కోరారు. బ్యాంకర్ల సహకారంతోనే సంక్షేమ కార్యక్రమాల ఫలాలు మారుమూల ప్రాంతాల ప్రజలకు అందుతున్నాయని, దేశంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చి తొలి స్థానంలో నిలిచిందని వివరించారు. సచివాలయంలో సోమవారం బ్యాంకర్లతో జరిగిన సమావేశం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed