- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అవి కమీషన్ల కోసమే: డీకే అరుణ
<p>దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలన కొనసాగడంలేదని, ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైన్ పేరుతో రూ. లక్ష కోట్లు మాయం చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరందించారనే విషయాన్ని ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ది పేరుతో కమీషన్ల కోసం రూ. 3 లక్షల కోట్ల అప్పు భారాన్ని […]</p>

దిశ, మహబూబ్ నగర్: తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు రాష్ట్రంలో పాలన కొనసాగడంలేదని, ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను దోచుకుంటున్నారని మాజీ మంత్రి డీకే అరుణ మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైన్ పేరుతో రూ. లక్ష కోట్లు మాయం చేశారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీరందించారనే విషయాన్ని ప్రభుత్వం లెక్కలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. అభివృద్ది పేరుతో కమీషన్ల కోసం రూ. 3 లక్షల కోట్ల అప్పు భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల కమీషన్ల కోసమే పరితపిస్తుందన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను తాము ఎత్తి చూపిస్తామని, ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళతామని ఆమె పేర్కొన్నారు. మాటల గారడితో ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని అరుణ హెచ్చరించారు.






