దళిత సాధికారత కోసం కలిసి పోరాడుదాం..

200

వనస్థలిపురం (దిశ): మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్​ను దళిత జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొజ్జ యాదగిరి మర్యాదపూర్వకంగా కలిశారు. నాచారంలో ఆయన నివాసంలో శుక్రవారం కలసి ప్రజా సమస్యలపై చర్చించారు. రాబోయే రోజుల్లో దళిత జన సమితిని ముందుకు తీసుకుళ్లేలా, దళిత సాధికారత కోసం కలిసి పోరాడుదామని దయాకర్ మద్దతు కోరినట్లు ఏదునూరు సంపత్, యాదగిరి తెలిపారు.