- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్ఆర్) బోనస్‌ను చెల్లించేందుకు నిర్ణయించినట్టు శనివారం సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా ఒక్కో కార్మికుడికి రూ.68,500 చెల్లించనున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్‌లో పనిచేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తిచేసిన వారు […]</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు ఈ నెల 12న దీపావళి (పీఎల్ఆర్) బోనస్‌ను చెల్లించేందుకు నిర్ణయించినట్టు శనివారం సంస్థ ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన జేబీసీసీఐ 10వ సమావేశంలో ఒప్పందం చేసుకున్న విధంగా ఒక్కో కార్మికుడికి రూ.68,500 చెల్లించనున్నట్టు అందులో పేర్కొంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో అండర్ గ్రౌండ్లో విధులు నిర్వహించిన వారు 190 మస్టర్లు, సర్ఫేస్‌లో పనిచేసే వారు 240 మస్టర్లు ఖచ్చితంగా పూర్తిచేసిన వారు ఈ బోనస్ పొందేందుకు అర్హులు అని యాజమాన్యం పేర్కొంది. ఈ పీఆర్ఎస్ బోనస్ నాన్ ఎగ్జిక్యూటివ్, పదో వేజ్‌బోర్డు కిందకు వచ్చిన వారికి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Next Story






