- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కలెక్టర్ VS వైద్యాధికారి.. చివరకు!
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావు పేటలో కలెక్టర్, వైద్యాధికారి మధ్య వాగ్వివాదం నెలకొంది. కరోనా వ్యాప్తి తీవ్రత, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం కలెక్టర్ శామ్యూల్ సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆయన తీరపై వైద్యాధికారి నాదెండ్ల సోమ్లానాయక్ అభ్యంతరం తెలిపారు. దీంతో సమావేశం మధ్యలో కలెక్టర్, వైద్యాధికారి మధ్య వాగ్వాదం జరిగింది. తమ పనితీరుపై ప్రశ్నించడానికి మీరెవరంటూ కలెక్టర్ శామ్యూల్‌పై వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తంచేశారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావు పేటలో కలెక్టర్, వైద్యాధికారి మధ్య వాగ్వివాదం నెలకొంది. కరోనా వ్యాప్తి తీవ్రత, దాని నివారణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం కలెక్టర్ శామ్యూల్ సమీక్ష నిర్వహించారు. వైద్య సిబ్బంది పనితీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆయన తీరపై వైద్యాధికారి నాదెండ్ల సోమ్లానాయక్ అభ్యంతరం తెలిపారు.
దీంతో సమావేశం మధ్యలో కలెక్టర్, వైద్యాధికారి మధ్య వాగ్వాదం జరిగింది. తమ పనితీరుపై ప్రశ్నించడానికి మీరెవరంటూ కలెక్టర్ శామ్యూల్‌పై వైద్యాధికారి ఆగ్రహం వ్యక్తంచేశారు. జిల్లా కలెక్టర్‌నే నువ్వెవరంటూ ప్రశ్నించడంపై శామ్యూల్ మండిపడ్డారు. దీంతో సోమ్లానాయక్‌ను అరెస్టు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా విధుల నుంచి సస్పెండ్ చేయాలని కూడా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read Also…
Next Story






