ఏపీలో జోరుగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ

270

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ‘వైఎస్ఆర్ పెన్షన్ కానుక’ పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా 60,50,377 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.1455.87 కోట్లు కేటాయించింది. 2.66 లక్షల మంది వాలంటీర్లు ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఉదయం నుంచే ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా తోటమెరకలో గ్రామ వాలంటీర్ పాకా మంగాలక్ష్మీ లబ్ధిదారులకు ఉదయం నుంచే పెన్షన్‌ను పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..