- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సర్వర్‌తో పరేషాన్
<p>దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు రేషన్ కార్డుపై ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం పంపిణీలో సాంకేతిక చిక్కులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సర్వర్ మొరాయించడంతో పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, ఇటు ఖమ్మం పట్టణంలోనూ ఇదే పరిస్థితి తలెత్తడం గమనార్హం. దీంతో చాలా వార్డుల్లో పంపిణీకి అంతరాయం కలుగుతోంది. సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి పేదలు రేషన్ షాపుల ఎదుట నిలబడి చివరికి అసహనంతో ఇళ్లకు చేరుకుంటున్నారు. […]</p>

దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు రేషన్ కార్డుపై ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం పంపిణీలో సాంకేతిక చిక్కులు తలెత్తుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సర్వర్ మొరాయించడంతో పంపిణీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అటు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో, ఇటు ఖమ్మం పట్టణంలోనూ ఇదే పరిస్థితి తలెత్తడం గమనార్హం. దీంతో చాలా వార్డుల్లో పంపిణీకి అంతరాయం కలుగుతోంది. సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి పేదలు రేషన్ షాపుల ఎదుట నిలబడి చివరికి అసహనంతో ఇళ్లకు చేరుకుంటున్నారు. అధికారులు సైతం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, హైదరాబాద్‌లోని సెంట్రల్ సర్వర్ నుంచే సమస్య ఎదురవుతోందని సమాధానం చెబుతున్నారని డీలర్లు వెల్లడిస్తున్నారు.
నిలిచిన రేషన్ సరఫరా
ఖమ్మం పట్టణంలో శుక్రవారం నుంచి రేషన్ పంపిణీ చేసేందుకు సివిల్ సప్లై అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నా రు. రోజుకు వంద మంది చొప్పున రేషన్ పంపిణీ చేసేందుకు డీలర్లు, డివిజన్ కార్పొరేటర్లు సమన్వయంతో కూపన్లు అందజేశారు. ఈ ప్రకారం రేషన్ పంపిణీకి సిద్ధమయ్యారు. అయితే శుక్రవారం ఉదయం నుంచి సర్వర్ డౌన్ కావడంతో డీలర్లు, అధికారులకు ఏం చేయాలో తోచడంలేదు. సర్వర్లు మొరాయించడంతో ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన రేషన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఖమ్మం నగరంలోని సంభానినగర్ ప్రాంతంలో ఉన్న 48, 97 రేషన్ దుకాణాల వద్ద ప్రజలు ఆందోళనకు దిగారు. సర్వర్లు పనిచేయకపోవడం ఏమిటని రేషన్ డీలర్లతో వాగ్వాదానికి దిగారు. మిగతా డివిజన్లలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం 669 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటిలో ఖమ్మం డివిజన్‌లో 512, కల్లూరు డివిజన్‌లో 157 షాపులు ఉన్నాయి. దాదాపుగా వీటన్నిటిల్లోనూ ఇదే సమస్య ఉండటంతో సరఫరాను నిలిపివేసినట్లు సమాచారం.
గంటల కొద్దీ నిరీక్షణ
మండలకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో గురువారమే పంపిణీ ప్రారంభమైంది. అయితే ఆన్‌లైన్ మొరాయింపు గురువారం నుంచే వేధిస్తోంది. దీంతో పేదలకు ఉచిత బియ్యం పొందడం మహా ప్రహసనంగా మారింది. గంటలకొద్దీ నిరీక్షించాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక శుక్రవారమైతే అసలే పనిచేయకపోవడంతో చాలాచోట్ల పంపిణీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. లబ్ధిదారులు సామాజిక దూరం పాటించేలా నిర్వాహకులు గడీలు ఏర్పాటు చేసినప్పటికీ ఉల్లంఘన జరుగుతోది. సర్వర్ సమస్యను తొందరగా పరిష్కరించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Tags: corona effect, lockdown, termination ration, server download, khammam, bhadradri Districts






