1.19 కోట్ల మందికి నిత్యావ‌స‌రాల‌ పంపిణీ

6
Kodali Nani

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కోటి 19లక్షల మందికి పదమూడో విడత నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఓ ప్రకటనలో వెల్లడించారు. మొత్తం 1,50,81,100 రేషన్​కార్డు దారులుంటే ఇప్పటిదాకా 1.19 కోట్ల మందికి ఉచితంగా సరకులు అందజేసినట్లు తెలిపారు. 1,99,187 మెట్రిక్ టన్నుల బియ్యం, 11,818 టన్నుల కందిపప్పు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.