- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ
<p>దిశ, నల్గొండ: లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీశ్ రెడ్డి అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం 108 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కరువులో ఆదుకున్న మంత్రికి బ్రాహ్మణ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 కూరగాయల మార్కెట్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట త్వరలో ఆరెంజ్ జోన్‌లోకి రాబోతుందని ఆనందం […]</p>

దిశ, నల్గొండ: లాక్‌డౌన్ సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద బ్రాహ్మణులకు మంత్రి జగదీశ్ రెడ్డి అండగా నిలిచారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం 108 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా కరువులో ఆదుకున్న మంత్రికి బ్రాహ్మణ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 కూరగాయల మార్కెట్‌లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట త్వరలో ఆరెంజ్ జోన్‌లోకి రాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్లే మంచి ఫలితాలను సాధించామని మంత్రి జగదీశ్ రెడ్డి తెలియజేశారు. ఇందులో భాగంగానే కూరగాయల మార్కెట్‌ను వికేంద్రీకరణ చేశామని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక మున్సిపల్ ఛైర్మన్ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.






