బెజవాడ టీడీపీలో కేశినేని వర్సెస్ బుద్ధా

by  |
బెజవాడ  టీడీపీలో కేశినేని వర్సెస్ బుద్ధా
X

దిశ వెబ్‌డెస్క్: బెజవాడ రాజకీయం వేడెక్కుతోంది. బెజవాడ టీడీపీలో ఎప్పటినుంచే తెరచాటున జరుగుతున్న వర్గ విబేధాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గాల మధ్య విబేధాలు మరింతగా ముదురుతున్నాయి. విజయవాడ మేయర్ అభ్యర్ధిగా కేశినేని నాని కూతురు కేశినేని శ్వేతను ఎంపిక చేయడంపై బుద్ధా వెంకన్న వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ నివాసంలో ఎమ్మెల్సీ వెంకన్న, నాగుల్ మీరా భేటీ అయ్యారు ఎంపీ కేశినేని నాని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఈ ముగ్గురు నేతలు.. మేయర్ ఎంపికపై చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబును కేశినేని రాంగ్ ట్రాక్‌లోకి తీసుకెళ్తున్నారని, టీడీపీ ఆఫీసులోనే కోవర్టులను పెట్టారని నేతలు ఆరోపించారు. చంద్రబాబుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఈ ముగ్గురు నేతలు ఆరోపించారు. మరి చూడాలి రానున్న రోజుల్లో బెజవాడ టీడీపీలో వర్గ విబేధాలు ఎటువైపుకు దారితీస్తాయో?



Next Story