- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Wall on Nala :నాలాపై వాల్
నాలాలు(Nalas), బఫర్ జోన్లు(Buffer Zones),, ఎఫ్ టీఎల్ (FTL)లో చేపట్టిన నిర్మాణాలను ఓ వైపు ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చి వేస్తున్నది.

దిశ, పరిగి : నాలాలు(Nalas), బఫర్ జోన్లు(Buffer Zones),, ఎఫ్ టీఎల్ (FTL)లో చేపట్టిన నిర్మాణాలను ఓ వైపు ప్రభుత్వం హైడ్రా పేరుతో కూల్చి వేస్తున్నది. పూడూరు మండలంలో మాత్రం మాటు కాలువలు కబ్జా చేయడం, నాలాలను పూడ్చి వేయడం, ఇష్టం వచ్చినట్లుగా డైవర్షన్ చేయడం మామూలైపోయింది. అధికారులు పట్టించుకోకపోడమే కాకుండా దర్జాగా ఎల్వోసీ ఇస్తున్నారంటూ రైతులు మండి పడుతున్నారు. భూగర్భ జలాలను పెంపొందించే మాటు కాలువలు, నాలాలను ధ్వంసం చేస్తున్నా పట్టించుకోకపోవడం ఏంటంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ఫోన్లు చేసి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా కనీసం కబ్జాకు గురైన వాగును చూసేందుకైనా రాకపోవడం గమ నార్హం అంటూ రైతులు తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ చెబుతున్నారు.
మాడాగు వాగు కబ్జా..
పరిగి డివిజన్ పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 35, 36 , 37, 38, 40, 41లోంచి మాడాగు వాగు ప్రతి వర్షా కాలంలో ఉప్పొంగి ప్రవహిస్తుందని గ్రామ రైతులు చెబుతున్నారు. కాగా వాగును ఆనుకొని సర్వే నంబర్ 37, 38, 39, 40, 41లలో సుమారు 12 ఎకరాలవిస్తీర్ణంలో రాయ్ చాందినీ అగర్వాల్ పేరుతో లే–అవుట్ చేస్తున్నారు. ఈ సర్వే నంబర్లలో ఉన్న మాడాగు వాగు నీటికి అడ్డంగా ప్రీకాస్ట్ వేల్ నిర్మిం చడం, కొన్నేళ్ల క్రితం నిర్మించిన వంతె నను కూడా ఈ లే–అవుట్ నిర్వాహకులు ధ్వంసం చేశారంటూ రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎలాంటి బఫర్ జోన్ వదలకుండా వాగుకు ఆనుకొనే కాంపౌడ్ వాల్ నిర్మిస్తున్నా, వాగును డైవర్షన్ చేసి చిన్నపాటి పైప్ లైన్ వేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారంటూ రైతులు మండి పడుతున్నారు.
డీటీసీపీ అనుమతులు ఉన్నాయి
గ్రామంలోని సర్వే నంబరు 37, 38, 39, 40, 41లలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో రాయ్ చాందినీ అగర్వాల్ పేరుతో లే–అవుట్ చేస్తు న్నది వాస్తవమే. కాని వారు డీటీసీపీ నుంచి అనుమతులు తెచ్చుకున్నారు. స్థానికంగా మాడాగు కబ్జా చేస్తున్నారంటూ రైతులు చెబుతున్నారు. కానీ అన్ని ఎన్వోసీలతో కూడిన అనుమతి పత్రాలు సమర్పించడం వల్లే పనులు జరుగుతున్నా ఊరుకుంటున్నా. వాగు కబ్జా చేస్తున్నారని, బఫర్ జోన్ వదలడం లేదంటూ ఫిర్యాదులు వచ్చాయంటూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తా.
- శ్రీ కాంత్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి
మాడాగు నీరు ఎలా వెళ్లాలి..
ప్రతి వానాకాలం ఈ వాగు నిండుగా వెళ్లి పంటపలాలను ముంచేస్తుంటుం ది. అలాంటి వాగుకు అడ్డంగా ప్రీకాస్ట్ వాల్, కాంపౌండ్ వాల్ నిర్మిస్తే నీరు ఎలా పోతుంది? ఈ విసయమై ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశాను. పంచాయతీ కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేస్తాం. వాగును ఆనుకొని నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇస్తారు? వాగు నిండి మా పొలం పక్క నుంచి నీరు పోతుంది. వాగును వదిలి కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటే అధిరులు మాకు సహకరించాలి.
- కుర్వ రాములు , రైతు
వాగును కబ్జా చెర నుంచి విడిపించాలి
గ్రామంలో లే–అవుట్ చేస్తున్న వారు మాడాగుకు అడ్డంగా కాంపౌండ్ వాల్ కడుతున్నారు. నీరు ఎలా వెళ్తుంది. అంతేకాకుండా వాగును ఇస్టం వచ్చినట్లుగా మార్చుతున్నారు. వర్షాకాలం నీరు ఎక్కువగా వస్తే రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లే–అవుట్ చేస్తే అందులో ఇల్లు నిర్మించుకున్నా భవిష్యత్తులో నీటమునిగే ప్రమాదం ఉంటుంది. అధికారులు స్పందించి మాడాగును కాపాడాలి. వాగుకు బపర్ జోన్ ఎంత వస్తుందో వదిలేసి నిర్మాణాలు చేపట్టుకునేలా అధికారులు సూచిస్తే బాగుంటుంది.
- ఎన్ సీతారాములు, మాజీ ఉప సర్పంచ్






