- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటక రంగ విశిష్టతను చాటిన ‘స్వస్థలం రంగస్థలం’
నాటక రంగం గొప్పదనాన్ని, దాని విశిష్టతను కళ్లకు కట్టినట్లు తెలియజేసేలా ప్రదర్శించిన ‘స్వస్థలం రంగస్థలం’ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: నాటక రంగం గొప్పదనాన్ని, దాని విశిష్టతను కళ్లకు కట్టినట్లు తెలియజేసేలా ప్రదర్శించిన ‘స్వస్థలం రంగస్థలం’ నాటిక ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మరియు ‘రంగస్థలి’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు 'రంగభూమి' వేదికగా ఈ నాటికను అద్భుతంగా ప్రదర్శించారు. ప్రతిభావంతుడైన దర్శకుడు వీర మనోహర్ కావలి ఈ నాటికకు రచన, దర్శకత్వం వహించారు.
నటీనటులకు అతిథుల ప్రశంసలు..
ఈ ప్రదర్శనకు ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మెర్సీ మార్గరెట్, క్రియేటివ్ థియేటర్ డైరెక్టర్ అజయ్ మంకినపల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆసాంతం ఆసక్తికరంగా సాగిన ఈ నాటికను వీక్షించిన అనంతరం, తమ అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించిన నటీనటులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది
ఈ సందర్భంగా దర్శకుడు వీర మనోహర్ కావలి మాట్లాడుతూ.. తెలంగాణలో నాటక రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. ముఖ్యంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి నాటక రంగానికి, కళాకారులకు అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పదన్నారు. నాటక రంగాన్ని ఆదరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఏనుగు నరసింహారెడ్డికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.






