టూల్‌కిట్‌ కేసు.. దిశా రవికి బెయిల్ మంజూరు

52

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టూల్‌కిట్ కేసులో ఎన్విరాన్ మెంటల్ యాక్టివిస్ట్ దిశా రవికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పలుమార్లు బెయిల్ పిటిషన్‌ను రిజర్వులో ఉంచిన కోర్టు.. వాదోపవాదాల అనంతరం దిశా రవి లాయర్ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కాగా, జనవరి-26వ తేదీన అగ్రిచట్టాలకు వ్యతిరేకంగా రైతులు తలపెట్టిన ట్రాక్టర్ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. శాంతియుతంగా జరగాల్సిన ర్యాలీ ఉధృతంగా మారడానికి స్వీడిష్ పర్యావేరణ ఉద్యమకారిణి షేర్ చేసిన టూల్ కిట్ కారణమని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనిని షేర్ చేయడంతో పాటు టూల్ కిట్ రూపకల్పనలో దిశా రవి హస్తముందని ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఆమెను బెంగళూరులో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..