- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్: సింగరేణి కార్మిక సంఘం నాయకుడికి షాక్
<p>దిశ, ఇల్లందు: ఉద్యోగి భార్యను వేధింపులకు గురిచేస్తున్న సింగరేణి కార్మిక సంఘం నాయకుడిపై ‘దిశ’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దళిత మహిళను వేధిస్తున్న ఇల్లందు డివిజన్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లుపై బుధవారం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, మహిళా వేధింపుల కేసులు నమోదయ్యాయి. కార్మికనేతకు అధికార బలం మెండుగా ఉందని, కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా బాధితురాలు వెనక్కి తగ్గినా.. ‘దిశ’ మీడియాలో వచ్చిన కథనంతో సదరు కార్మిక […]</p>

X
దిశ, ఇల్లందు: ఉద్యోగి భార్యను వేధింపులకు గురిచేస్తున్న సింగరేణి కార్మిక సంఘం నాయకుడిపై ‘దిశ’లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దళిత మహిళను వేధిస్తున్న ఇల్లందు డివిజన్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గడ్డం వెంకటేశ్వర్లుపై బుధవారం ఇల్లందు పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, మహిళా వేధింపుల కేసులు నమోదయ్యాయి. కార్మికనేతకు అధికార బలం మెండుగా ఉందని, కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా బాధితురాలు వెనక్కి తగ్గినా.. ‘దిశ’ మీడియాలో వచ్చిన కథనంతో సదరు కార్మిక నేత బండారం బయటపడింది. దీంతో గుర్తింపు కార్మిక సంఘానికి డివిజన్‌లో పెద్ద దిక్కుగా ఉన్న గడ్డం వెంకటేశ్వర్లు వ్యవహారం అటు పార్టీలోనూ, ఇటు యూనియన్‌లోనూ చర్చనీయాంశంగా మారింది.
మీ ఆయన లేడా? రాత్రికి రా.. సింగరేణి కార్మికనేత ఆడియో లీక్
Next Story






