- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘దిశ’ ఎఫెక్ట్.. పంచాయతీ రాజ్ ఉద్యోగులు సస్పెండ్, బదిలీ..
<p>దిశ ప్రతినిధి, మెదక్ : విధులు నిర్వహించాల్సిన సమయంలో మందు, చిందేసిన అధికారుల తీరుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. మందేసి.. చిందేసిన పంచాయతీ రాజ్ ఉద్యోగులు అనే కథనాన్ని ‘దిశ’ ప్రచురించిన విషయం తెలిసిందే. ‘దిశ’ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణ చేసిన అధికారులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం (విందు) నిర్వహించినట్టు తేల్చారు. అధికారులు […]</p>

X
దిశ ప్రతినిధి, మెదక్ : విధులు నిర్వహించాల్సిన సమయంలో మందు, చిందేసిన అధికారుల తీరుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై కలెక్టర్ కొరడా ఝుళిపించారు. మందేసి.. చిందేసిన పంచాయతీ రాజ్ ఉద్యోగులు అనే కథనాన్ని ‘దిశ’ ప్రచురించిన విషయం తెలిసిందే.

‘దిశ’ కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి వెంటనే విచారణకు ఆదేశించారు. విచారణ చేసిన అధికారులు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి సమావేశం (విందు) నిర్వహించినట్టు తేల్చారు. అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కొండపాక ఎంపీవో నరసింహ రావుని సస్పెండ్, కొండపాక ఎంపీడీవో రాజేశ్‌ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Next Story






