- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఏపీ కేబినెట్ భేటీ.. ఆ వివాదంపై చర్చ
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీ క్యాబినెట్ భేటీ బుధవారం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలో ఐటీ విధానానికి ఆమోదం తెలుపనున్నారు. అంతేకాకుండా, జాబ్ క్యాలెండర్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో జల వివాదాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీ క్యాబినెట్ భేటీ బుధవారం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇదే సమావేశంలో ఐటీ విధానానికి ఆమోదం తెలుపనున్నారు. అంతేకాకుండా, జాబ్ క్యాలెండర్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో జల వివాదాలు, టిడ్కో ఇళ్ల నిర్మాణం, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, ధర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధతపైనా చర్చ జరగనుంది. ఈ ఏడాది మిగిలిన సంక్షేమ పథకాల అమలుపైనా కేబినెట్ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
Next Story






