- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్సప్ గ్రూపులో బాలానగర్ ఫ్లైఓవర్ పేరు పంచాయితి…
<p>దిశ, కూకట్పల్లి: బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుందో లేదో కాని బాలానగర్ ప్రజల మధ్య పేరు చిచ్చు పెట్టింది. ఇదేంటి అనుకుంటున్నారా… వినండి… బాలానగర్ జనాలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి 2017 ఆగస్టు 21న, 387 కోట్ల రూపాయలతో బాలానగర్ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించగా ఇప్పుడు పనులు పూర్తి అయి ఈ నెల ఆఖరున ప్రారంభానికి సిద్ధం అవుతుంది. బ్రిడ్జి నిర్మాణం అంతట సజావుగా సాగిన ప్రారంభానికి సిద్ధం అయిన తరుణంలో ఫ్లైఓవర్బ్రిడ్జికి […]</p>

దిశ, కూకట్పల్లి: బాలానగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తుందో లేదో కాని బాలానగర్ ప్రజల మధ్య పేరు చిచ్చు పెట్టింది. ఇదేంటి అనుకుంటున్నారా… వినండి… బాలానగర్ జనాలకు ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి 2017 ఆగస్టు 21న, 387 కోట్ల రూపాయలతో బాలానగర్ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభించగా ఇప్పుడు పనులు పూర్తి అయి ఈ నెల ఆఖరున ప్రారంభానికి సిద్ధం అవుతుంది. బ్రిడ్జి నిర్మాణం అంతట సజావుగా సాగిన ప్రారంభానికి సిద్ధం అయిన తరుణంలో ఫ్లైఓవర్బ్రిడ్జికి మా నాయకుడి పేరు పెట్టాలి అంటే మా నాయకుడి పేరు పెట్టాలని పోటి పడుతున్నారు.
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకులు ఎంపీ రేవంత్ రెడ్డి, జోనల్కమిషనర్మమతకు ఫ్లైఓవర్‌కు స్వర్గీయ పీజేఆర్ పేరు పెట్టాలని విన్నవించారు. ఇదిలా ఉంటే బాలానగర్‌లో వాట్సప్ వేదికగా ఈ విషయంపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఫ్లైఓవర్‌కు ఎన్టీఆర్‌పేరు పెట్టాలని ఓ వర్గం, తెలంగాణ తల్లి పేరు పెట్టాలని ఉద్యమకారులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ఓ వర్గం వారు వాట్సప్‌లో గట్టిగా చర్చించుకుంటున్నారు. ఇప్పుడు బాలానగర్, ఫతేనగర్పరిసరాలలో ఏ ఒక్కరిని కదిలించిన ఫ్లైఓవర్పేరు విషయంలోనే చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే అధికార పార్టీ నాయకుల నుంచి మాత్రం ఎటువంటి స్పందన లేదు. బాలానగర్ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఎవరి పేరు పెట్టనున్నారో వేచి చూడాల్సిందే…










