రఘునందన్ రావు వ్యాఖ్యలపై TRS నాయకుల్లో టెన్షన్.. వారిద్దరు ఎవరూ ?

by  |
రఘునందన్ రావు వ్యాఖ్యలపై TRS నాయకుల్లో టెన్షన్.. వారిద్దరు ఎవరూ ?
X

దిశ, సత్తుపల్లి: సత్తుపల్లి రాజకీయ పార్టీల మధ్య రఘునందన్ రావు వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి. రెండు రోజుల క్రితం ఒక వార్త ఛానెల్లో వచ్చిన డిబేట్ కార్యక్రమంలో దుబ్బాక శాసనసభ సభ్యులు భారతీయజనతాపార్టీ నాయకులు రఘునందన్ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించిందని, అందులో భాగంగా జిల్లాకు చెందిన ఒక మాజీమంత్రి, మాజీ ఎంపీ మాతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అందులో నిజానిజాలు ఎంత వరకు వున్నాయి అన్నదానిపై సత్తుపల్లి రాజకీయ నాయకులు విశ్లేషణ చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఆ ఇద్దరు ప్రముఖులు సత్తుపల్లి ప్రాతంలో ప్రత్యేక అనుచర వర్గం కలిగిన వారిగా వారు ఊహిస్తున్నారు. రఘునందన్ వ్యాఖ్యలను బట్టి వారు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయి ఉంటారనే చర్చ ఊపందుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేయటంతో ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో విశ్లేషణ మొదలైంది.

గత కొంత కాలం నుండి వారు పార్టీ కార్యక్రమంలో ఇతర నాయకులతో కాకుండ ఒంటరిగా కార్యక్రమలు చేస్తున్నారు. అలాగే తమ నాయకుడికి పదవి ఇవ్వటంలో తస్థార్యం చేస్తుండటంతో కొంత అసంతృప్తి‌తో ఉన్నారు. సిట్టింగ్ ఎం‌పీ‌గా ఉన్నా పొంగులేటి‌ని కాదని, నామ‌కు టిక్కెట్ ఇవ్వడం దగ్గరనుండి మొదలు అప్పటి నుండి ప్రతిసారి ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ప్రతిపాదనల్లో పొంగులేటి పేరు ప్రముఖంగా వినిపించటం చివరికి అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశతో వున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా పొంగులేటి పేరు వినిపించినా చివరకు తాతా మధుకు ఆ అవకాశం దక్కింది. తాతా మధు నిర్వహిస్తున్న ఎన్నికల సమీక్షలకు స్థానిక పొంగులేటి వర్గం హాజరు కావట్లేదు. నియోజకవర్గ పరిధిలో పొంగులేటి వర్గం వారు చేస్తున్న పర్యటన ల్లో గాని, కార్యక్రమంలో గాని అంతా ఒంటరి ప్రయాణం గానే కనిపిస్తుంది. పార్టీ పరంగానే కాక వ్యక్తిగతం‌గా కూడా శ్రీనివాసరెడ్డి‌కి నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారి తమ నాయకుడికి గుర్తింపు వస్తుందని అభిమానులు ఆశతో ఎదురు చూస్తున్నారు. కొంత మంది అభిమానులు అప్పుడే తమ నాయకుడు ఏ నిర్ణయం తీసుకోలేదని వేచిచూద్దాం అనే ధోరణిలో ఉన్నారని ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది అని నమ్మకంతో ఉన్నారంటూ అలాగే ఖచ్చితమైన హామితోనే ముందుకు వెళ్తారని విశ్లేషిస్తున్నారు.


Next Story

Most Viewed