'అ!' సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ..

by  |
అ! సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ..
X

‘అ!’ సినిమా .. కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా, ఇషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం. వాల్ పోస్టర్ బ్యానర్‌లో నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వెరైటీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. సైన్స్ ఫిక్షన్‌గా వచ్చిన సినిమా భావోద్వేగాల మిళితంగా ఉంటుంది. అమ్మాయిలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలను టచ్ చేసిన దర్శకుడు చెట్ల వల్ల సమాజానికి కలిగే లాభాలను చక్కగా ఆవిష్కరించారు. ఉత్తమ మేకప్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డులను దక్కించుకున్న సినిమాకు సీక్వెల్ రాబోతుందట. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించాడు. ‘అ!-2’ కోసం ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలిపాడు. సరైన నిర్మాత దొరకకా వెయిట్ చేస్తున్నట్లు చెప్పాడు. త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నానననీ, సీక్వెల్‌లో ‘అ!’ కు మించిన థ్రిల్లింగ్ ఉంటుందని తెలిపారు.


Next Story

Most Viewed