- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ హీరోయిన్ పై డైరెక్టర్ ఫైర్.. ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వవా అంటూ అరిచి
<p>దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కృతి, రామ్ పోతినేని హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెట్ లో డైరెక్టర్, కృతి యాక్టింగ్ పై అసహనం వ్యక్తం చేశాడంట. సీనియర్ నటుడు నాజర్ – కృతి మధ్య జరిగే సెంటిమెంట్ సీన్ షూట్ చేస్తుండగా […]</p>

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకుంటూ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కృతి, రామ్ పోతినేని హీరోగా, లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సెట్ లో డైరెక్టర్, కృతి యాక్టింగ్ పై అసహనం వ్యక్తం చేశాడంట. సీనియర్ నటుడు నాజర్ – కృతి మధ్య జరిగే సెంటిమెంట్ సీన్ షూట్ చేస్తుండగా సరైన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో కృతి ఫెయిల్ అయిందట. చాలా టేక్స్ తీసుకున్న డైరెక్టర్ విసిగిపోయి కృతిపై అరిచినట్లు సమాచారం.
షూట్ కి ముందే ఆ సీన్ ని ప్రాక్టీస్ చేసి ఉంటే బావుండేది కదా.. అని యూనిట్ వర్గాలు హీరోయిన్ కి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్నిసార్లు ఎంత పెద్ద హీరోకైనా హావభావాలు పలకడం కష్టంగానే ఉంటుంది.. కృతిశెట్టి కి ఇది మూడో సినిమా.. ఒకేసారి అంతా ఎమోషనల్ సీన్స్ అంటే అమ్మడు కొంచెం తడబడడం సాధారణమే.. అందులో నాజర్ లాంటి సీనియర్ నటుడితో అంటే స్టార్ హీరోయిన్లకే చుక్కలు కనిపిస్తాయి.. ఇంకా బేబమ్మ ఎంత..? అంటూ బేబమ్మ ఫ్యాన్స్ వెనకేసుకొస్తున్నారట..






