వకీల్ సాబ్ తో భయపెడుతున్న దిల్ రాజు ..?

by  |
వకీల్ సాబ్ తో భయపెడుతున్న దిల్ రాజు ..?
X

దిశ, వెబ్ డెస్క్: హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన ‘పింక్’ చిత్రానికి అఫీషియల్ రీమేక్ గా ‘వకీల్ సాబ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు – శిరీష్ నిర్మిస్తున్నారు. బోనీ కపూర్ సమర్పణలో వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా పవన్ రీ ఎంట్రీగా వస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా కోసం మెగా అభిమానుల తోపాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ అండ్ సాంగ్ సినిమా మీద భారీ అంచనాలు పెంచేశాయి.

అయితే ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు గత మే నెల 15 వ తేదీని ఫిక్స్ చేశాడు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ దశలోనే నిలిచిపోయింది. కాగా రీసెంట్ గా మళ్ళీ మొదలైన ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అయింది. అందుకే ప్రమోషన్స్ మొదలు పెట్టి మెగా అభిమానులకి భారీ సర్‌ప్రైజెస్ ఇవ్వాలనుకుంటే ఈ లోపు తెలంగాణలో జీహెచెంసీ ఎలక్షన్స్ కారణంగా వకీల్ సాబ్ షూటింగ్ కి బ్రేక్ పడింది. అంతేకాదు సంక్రాంతికి రిలీజ్ కావల్సి ఉన్న ఈ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.

అంతేకాదు ఈ సినిమా బిజినెస్ కారణంగా కూడా రిలీజ్ కి అడ్డంకులు వస్తున్నాయని తెలుస్తోంది. దిల్ రాజు చెప్పే రేట్లకి సినిమా తీసుకోడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదని చెప్పుకుంటున్నారు. ఒకవేళ దిల్ రాజు సొంతగా రిలీజ్ చేయాలనుకున్నా పెట్టిన పెట్టుబడి రాదన్న సందేహాలు కొందరిలో కలుగుతున్నాయట. అయితే ఈ నెల 25 న మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా మీదే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ కావాల్సిన సినిమాల భవిష్యత్తు ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి.. వకీల్ సాబ్ రిలీజ్ విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

Next Story