నాలుగేండ్ల తర్వాత DP మార్చిన అయ్యర్ తండ్రి.. కారణం తెలుస్తే షాక్ అవ్వాల్సిందే..

by  |

దిశ, వెబ్‌డెస్క్: శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ నాలుగు సంవత్సరాల తర్వాత తన వాట్సాప్ DP ని మార్చాడు. శ్రేయస్ అయ్యర్ న్యూజీలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేసిన తర్వాత వాట్సాప్ DPని మార్చినట్లు తెలిపాడు. శ్రేయస్ ఇండియా టెస్ట్ జెర్సీని ధరించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని పట్టుకుని ఉన్న ఫొటోని తన DP గా 2017లో పెట్టుకున్నాడు. అప్పటి నుండి అదే DP పెట్టుకున్నాడంటా. నేను దానిని ఎప్పుడూ మార్చలేదు, ఎందుకంటే టెస్ట్ క్రికెట్ ఆడటమే అతని అంతిమ లక్ష్యం అని నేను అతనికి గుర్తు చేయాలనుకున్నాను. చివరకు అది జరగడం పట్ల నేను చాలా థ్రిల్‌గా ఉన్నాను అని అయ్యర్ తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story