మాల్దీవుల్లో కొట్టుకున్న వార్నర్, స్లేటర్?

by  |
మాల్దీవుల్లో కొట్టుకున్న వార్నర్, స్లేటర్?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ అర్దాంతరంగా వాయిదా పడటంతో అన్ని దేశాల క్రికెటర్లు ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించడంతో ఆసీస్ క్రికెటర్లు మాల్దీవులకు వెళ్లారు. అక్కడ తాజ్ కోరల్ రిసార్టులో గడుపుతున్నారు. కాగా, కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న మైఖేల్ స్లేటర్ ఆసీస్ క్రికెటర్లు రావడానికి కొన్ని రోజుల ముందే మాల్దీవులకు వెళ్లారు. అక్కడకు వచ్చిన ఆసీస్ క్రికెటర్లు ఆయన ఉంటున్న రిసార్టులోనే బస చేస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్ డేవడ్ వార్నర్, కామెంటేటర్ మైఖేల్ స్లేటర్ ఒక బార్లో ఫుల్‌గా మద్యం తాగి గొడవకు దిగారని.. వివాదం తీవ్రంగా మారడంతో కొట్టుకున్నారంటూ ది డైలీ టెలిగ్రాఫ్ అనే పత్రిక కథనం వెలువరించింది. దీనిపై వారిద్దరూ ఆదివారం స్పందించారు. తమ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని.. ఎప్పటి నుంచో మేమిద్దరం స్నేహితులమని చెప్పారు.

కాగా, అంతకు ముందే స్లేటర్ ఆ పత్రికకు సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్‌కు ఒక మెసేజ్ చేశారు. ‘నాకు, వార్నర్‌కు ఎలాంటి గొడవలు లేవు. మా మద్య ఎలాంటి గొడవ జరగలేదు. ఇవన్నీ పుకార్లే. తప్పుడు వార్తలు’ అంటూ ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. వార్నర్ కూడా సదరు పత్రిక జర్నలిస్టుకు మెసేజ్ చేశాడు. ‘ఇలాంటి నిరాధార వార్తలు రాయవద్దు. అయినా చూడకుండా వార్తలు ఎలా రాస్తారు’ అని వార్నర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఇద్దరూ కలసి గొడవ పడలేదని చెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగింది.


Next Story

Most Viewed