Premam: సాయిపల్లవికి మెమొరీ లాస్.. డైరెక్టర్ ఎక్స్‌ప్లనేషన్

by  |
Premam: సాయిపల్లవికి మెమొరీ లాస్.. డైరెక్టర్ ఎక్స్‌ప్లనేషన్
X

దిశ, సినిమా : మలయాళం హీరో నివిన్ పౌలీ, సాయి పల్లవి ప్రధానపాత్రల్లో నటించిన వెరైటీ లవ్ స్టోరీ ‘ప్రేమమ్’. అనుపమ పరమేశ్వరన్, మడోనా సెబాస్టియన్ కీలకపాత్రల్లో కనిపించిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్ తనకు ఇప్పటికీ అర్థం కాలేదని డైరెక్టర్‌కు మెసేజ్ చేశాడు ఓ అభిమాని. క్లైమాక్స్‌లో మలార్(సాయి పల్లవి)కు జార్జ్ గుర్తుకు వచ్చాడా లేదా? అని ప్రశ్నించాడు.

దీనికి సమాధానమిచ్చిన డైరెక్టర్.. మలార్‌ మెమొరీలాస్‌తో బాధపడింది. కానీ గుర్తుకువచ్చాక జార్జ్(నివిన్ పౌలీ) పెళ్లికి వచ్చిన తను సెలీనాతో హ్యాపీగా ఉండటం చూసి బయటకు చెప్పలేకపోతుందని, ఆ విషయం జార్జ్‌కు కూడా అర్థం అయిందని వివరించాడు. ఇది డైలాగ్స్‌తో చెప్పలేదు కానీ మ్యూజిక్ ద్వారా కన్వే చేయగలిగామని తెలిపాడు. ఇప్పటికైనా అభిమాని డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానని చెప్పాడు డైరెక్టర్.

Did Malar really lose her memory in ‘Premam’? Alphonse Puthren clarifies

Next Story

Most Viewed