చిరంజీవి సర్జా జయంతిన ధ్రువ సర్జా మూవీ లాంచ్..

25

దిశ, వెబ్ డెస్క్ :

కన్నడ హీరో చిరంజీవి సర్జా జయంతిని పురస్కరించుకుని తన నూతన చిత్రం ప్రారంభించారు ధ్రువ సర్జా. ‘జాంబవంత’ టైటిల్‌తో తెరకెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాలు బెంగళూరులోని బసవేశ్వర్ నగర్ గణపతి దేవాలయంలో నిర్వహించారు. నంద కిషోర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాను ఉదయ్ మెహతా నిర్మించనున్నారు. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది మూవీ యూనిట్.

కాగా చిరంజీవి సర్జా వైఫ్ మేఘన సర్జా కూడా తన భర్తకు విషెస్ అందించింది. ‘హ్యాపీ బర్త్ డే మై వరల్డ్.. ఎల్లప్పుడూ, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’ అని తెలిపింది.