- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే వేదికపై 16 జంటలు.. మూడు మతాల వివాహాలు
<p>దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో 16 జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించారు. సోమవారం ధర్మపురి సంజయ్ బర్త్ డే సందర్భంగా నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సాముహిక వివాహాలు నిర్వహించి, నూతన జంటలకు వస్తు సామాగ్రి అందచేశారు. ఈ వివాహ వేడుకలో రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. తాము తొలి నాళ్లలో ధర్మపురి చారి […]</p>

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ ధర్మపురి సంజయ్ ఆధ్వర్యంలో 16 జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించారు. సోమవారం ధర్మపురి సంజయ్ బర్త్ డే సందర్భంగా నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సాముహిక వివాహాలు నిర్వహించి, నూతన జంటలకు వస్తు సామాగ్రి అందచేశారు. ఈ వివాహ వేడుకలో రాజ్యసభ సభ్యులు ధర్మపురి శ్రీనివాస్ హాజరై నూతన జంటలను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా డీఎస్ మాట్లాడుతూ.. తాము తొలి నాళ్లలో ధర్మపురి చారి ట్రబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏడాది సంజయ్ పుట్టినరోజున పేద జంటలకు ఉచిత వివాహాలను జరిపినట్లు గుర్తుచేశారు. ఒకటి, రెండు సంవత్సరాలు మినహా ప్రతి ఏడాది ఈ సేవా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈసారి వినూత్నంగా అన్ని మతాల వివాహాలను ఒకే వేదికపై జరిపించడం ఆనందంగా ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పుర ప్రముఖులు మాజీ మేయర్ సంజయ్‌ను, నూతన జంటలను ఆశీర్వదించారు.






