ధరణి పోర్టల్‌తో సాంకేతిక విప్లవం : ట్రెసా

by  |
ధరణి పోర్టల్‌తో సాంకేతిక విప్లవం : ట్రెసా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు, ప్రజలకు ఏకకాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ సేవలు సత్వరంగా, పారదర్శకంగా అందించేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రెవెన్యూ శాఖలో సాంకేతిక విప్లవం సృష్టిస్తుందని ట్రెసా అధ్యక్ష కార్యదర్శులు వంగా రవీందర్ రెడ్డి, కె.గౌతమ్ కుమార్ అన్నారు. గురువారం మూడుచింతలపల్లి మండలంలో ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం కేసీఆర్‌కు ట్రెసా బృందం శుభాకాంక్షలు తెలిపింది.

ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి సీఎం రెవెన్యూ శాఖపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని, రెవెన్యూ శాఖ పని తీరును, ప్రతిష్టను పెంచే విధంగా సీఎం మాట్లాడటం పట్ల కృతజ్ఞతలు చెప్పారు. నూతన రెవెన్యూ చట్టం అమలుకు, ప్రజా సంక్షేమం కోసం రెవెన్యూ ఉద్యోగులంతా శక్తి వంఛన లేకుండా కృషి చేస్తామన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్, పట్టా మార్పిడి, విరాసత్, దాన పత్రం, జాగా పంపిణీ వంటి సేవలను పారదర్శకంగా అందిస్తామన్నారు.

తహశీల్దార్ కార్యాలయ నిర్వహణకు, ఆఫీస్ ఖర్చులకు ప్రభుత్వం రూ.60 కోట్లు కేటాయించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ట్రెసా అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, కార్యదర్శి బాణాల రాంరెడ్డి, వాణి ఆర్గనైసింగ్ సెక్రటరీ నాగమణి, నాయకులు రమణరెడ్డి, రామకృష్ణారెడ్డి, సుధాకర్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed