ధరణి కి సిద్ధం కావాలి

by Shyam |

<p>దిశ, ఆందోల్: ఈనెల 25న ధరణి పోర్టల్ ప్రారంభమవుతుందనీ, దీన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. జోగిపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి కేంద్రంలో డెమో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రిజిస్ట్రేషన్ లు, మ్యూటేషన్లపై జాయింట్ రిజిస్ట్రార్‌గా తహశీల్దార్లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీ తనంగా, భద్రతతో కూడిన [&hellip;]</p>

ధరణి కి సిద్ధం కావాలి
X

దిశ, ఆందోల్: ఈనెల 25న ధరణి పోర్టల్ ప్రారంభమవుతుందనీ, దీన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. జోగిపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి కేంద్రంలో డెమో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రిజిస్ట్రేషన్ లు, మ్యూటేషన్లపై జాయింట్ రిజిస్ట్రార్‌గా తహశీల్దార్లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీ తనంగా, భద్రతతో కూడిన ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.

Next Story