ధన్‌రాజ్ బాలీవుడ్ ఎంట్రీ

by  |
ధన్‌రాజ్ బాలీవుడ్ ఎంట్రీ
X

దిశ, వెబ్‌డెస్క్ : జబర్దస్త్ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి తెలుగు తెరపై తన కామెడీతో మెప్పించాడు ధన్‌రాజ్. జై, జగడం, పిల్ల జమీందార్, సర్దార్ గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, భీమిలి కబడ్డి జట్టు, రాజుగారి గది, గోపాల గోపాల లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధన్‌రాజ్..బాలీవుడ్‌కు కూడా ఎంట్రీ ఇచ్చాడు.

అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ మూవీ ‘భాగమతి’ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన ఆయన..అదే పాత్రను బాలీవుడ్ రీమేక్ ‘దుర్గామతి’లో చేస్తున్నాడు. ఈ విషయాన్ని తెలుపుతూ హీరోయిన్ భూమి పెడ్నేకర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశాడు. తనతో కలిసి నటించడం ఆనందంగా ఉందని చెప్పాడు ధన్‌రాజ్. అమెజాన్ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించాడు.

https://www.facebook.com/ActorDhanraj/posts/3953905187966912



Next Story

Most Viewed