వినాయక నిమజ్జనం.. ఫుల్ జోష్‌లో డీహెచ్ చిందులు(వీడియో)

by  |
వినాయక నిమజ్జనం.. ఫుల్ జోష్‌లో డీహెచ్ చిందులు(వీడియో)
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు ఉద్యోగులతో కలిసి చిందేశారు. డీజేలో వస్తున్న వినాయకుని భక్తి పాటలకు అనుగుణంగా ఉద్యోగులతో కలిసి స్టెప్పులు వేసి అందరినీ సంతోషపరిచారు. కోఠిలోని డీఎంహెచ్ఎస్ ఆవరణలో టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు మామిడి ప్రభాకర్, కార్యదర్శి హరిల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంగళవారం ఐదవ రోజు విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించే కార్యక్రమంలో డీహెచ్ కూడా ఉద్యోగులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమతో కలిసి నృత్యం చేశారని.. దేవుడి పట్ల తనకు ఉన్న భక్తి భావాన్ని చాటుకున్నారని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఇక్కడి వినాయకుని వద్ద ఏర్పాటు చేసిన లడ్డూ వేలం పాటలో సీనియర్ అసిస్టెంట్ జగ్పాల్ రూ 91,108లు పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు శంకర్, దేవీదాస్, చక్రధర్, క్రాంతికుమార్, జయ్ కుమార్, వినోద్, చంద్రశేఖర్, ప్రభాకర్, ఉద్దవ్, డీడీ శ్రీనివాస్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, పాండు నాయక్, సుమ, మహ్మద్ రవూఫొద్ధీన్, గణేష్, సంజీవ్ కుమార్, భరణి రాణి, కృష్ణమోహన్, రఘువీర్ సింగ్, పద్మకాంతి, సాయి, ఆశీష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed