- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పిన డీజీపీ
by Shyam |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గత 3నెలలుగా నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. విశ్రాంతి అవసరమైనవారికి సెలవులు మంజూరు చేస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విశ్రాంతి లేకుండా డ్యూటీల్లో నిమగ్నం అవుతుండటంతో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో అవసరమైనవారికి సెలవులు మంజూరు చేయాలని డీజీపీ నిర్ణయించారు. సీఎల్, ఈఎల్‌లతో పాటు విశ్రాంతి అవసరమైన వారికి సెలవులు, కొవిడ్ […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా గత 3నెలలుగా నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. విశ్రాంతి అవసరమైనవారికి సెలవులు మంజూరు చేస్తూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని కమిషనరేట్ల పరిధిలో పోలీసులు విశ్రాంతి లేకుండా డ్యూటీల్లో నిమగ్నం అవుతుండటంతో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో అవసరమైనవారికి సెలవులు మంజూరు చేయాలని డీజీపీ నిర్ణయించారు. సీఎల్, ఈఎల్‌లతో పాటు విశ్రాంతి అవసరమైన వారికి సెలవులు, కొవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే సెలువులు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story






