కమిషనర్లతో డీజీపీ సమీక్ష

39

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖను డీజీపీ మహేందర్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, సైబరాబాద్ సీపీ సజ్జనార్‌లతో డీజీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీతో పాటు కలెక్టర్లు, వివిధ శాఖలతో కలిసి సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు. భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.