ఏపీలో ఉద్రిక్తత.. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు : డీజీపీ సవాంగ్ వార్నింగ్

by  |
DGP-Gautam-sawang comments on Gang Rape Case
X

దిశ, ఏపీ బ్యూరో : రెచ్చగొట్టే వ్యాఖ్యల పట్ల ప్రజలు ఆవేశాలకు గురికావద్దు.. సంయమనం పాటించాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరు తమ చేతిలోకి తీసుకోవద్దు, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించామని, ప్రజలంతా శాంతిభద్రతల పరిరక్షణలో సంయమనం పాటిస్తూ సహకరించాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా బలగాలు మోహరింపు..

రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం, విజయవాడలోని టీడీపీ కార్యాలయం, పట్టాభి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అలాగే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రత పెంచారు. స్పెషల్ పార్టీ పోలీసులతో అధికారులు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు.


Next Story

Most Viewed