ఏపీఎస్పీ అధికారులకు ‘డీజీపీ డిస్క్’అవార్డు

by  |
ఏపీఎస్పీ అధికారులకు ‘డీజీపీ డిస్క్’అవార్డు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీఎస్పీలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి డీజీపీ డిస్క్ అవార్డును ప్రదానం చేయనున్నట్లు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. ఈ అవార్డును కొత్తగా ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు. ఏపీఎస్పీ ఒక పారామిలటరీ ఫోర్స్ లాగా ఏర్పాటయిందని, ఈ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచీ ఉన్నదని గుర్తు చేశారు. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోందని, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉందని కితాబు ఇచ్చారు. ఏపీఎస్పీ సేవలు అత్యుత్తమమైనవని, పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక అని అన్నారు. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయని, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్ కు ఏపీఎస్పీ వెన్నెముకని పేర్కొన్నారు. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికమని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమేనన్న డీజీపీ.. ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్ గా గుర్తించబడిందని చెప్పారు.

Next Story

Most Viewed