- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి..? దీని వెనుక రహస్యం ఏంటీ
దసరా పండుగ... హిందువులు చాలా గ్రాండ్ గా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. దసరా రోజున అమ్మవారికి, ఆయుధాలకు

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగ... హిందువులు చాలా గ్రాండ్ గా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. దసరా రోజున అమ్మవారికి, ఆయుధాలకు పూజలు నిర్వహిస్తారు. దసరా రోజున నూతన వస్త్రాలు కూడా ధరిస్తారు. కొంతమంది కొత్త వాహనాలు దసరా రోజునే కొనుగోలు చేసి.. పూజలు కూడా చేస్తారు. అయితే దసరా అంటేనే మొదట గుర్తుకు వచ్చేది పాలపిట్ట, జమ్మి ఆకు. దసరా రోజు లేవగానే... కచ్చితంగా పాలపిట్టను చూడాలని.. పురాణాలు చెబుతున్నాయి. అసలు పాలపిట్ట ఎందుకు చూడాలి..? చూస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పాండవులు అజ్ఞాతవాసాన్ని ముగించుకుని రాజ్యానికి తిరిగి వస్తుండగా... వాళ్లకు పాలపిట్ట మొదట కనిపించిందని.. శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక అప్పటి నుంచి వాళ్లు వరుసగా విజయాలు దక్కించుకున్నారట. దీంతో విజయదశమి రోజు తప్పనిసరిగా పాలపిట్ట చూడాలని... హిందువుల నమ్మకం. పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటారు. దసరా రోజున సాయంత్రం దేవాలయాల్లో జమ్మి చెట్లకు పూజ చేసి... ఆ తర్వాత పాలపిట్ట దర్శనానికి వెళుతూ ఉంటారు. మరి కొంతమంది దసరా రోజు ఉదయం లేవగానే పాలపిట్టను చూస్తారు. దానివల్ల అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని.. అలాగే దోషాలు కలిగిపోతాయని... ఆచారాలు చెబుతున్నాయి.
పాలపిట్టపై మరో వాదన
హిందూ పురాణాల ప్రకారం త్రేతా యుగంలో విజయదశమి రోజునే... రావణాసురుడితో యుద్ధానికి శ్రీరాముడు బయలుదేరారట. ఆ సమయంలో శ్రీరాముడికి పాలపిట్ట కనిపించిందని చెబుతుంటారు. ఇక ఈ యుద్ధంలో రావణాసురుడిని రాముడు మట్టి కరిపిస్తాడు. దీంతో పాలపిట్టను శుభసూచకంగా... శ్రీరాముడు భావించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే చాలా చోట్ల దసరా రోజున రావణాసురుడి బొమ్మను.. కాల్చేస్తూ ఉంటారు.






