రేపే కార్తీక పౌర్ణమి.. ఆ సమయంలో దీపారాధన చేస్తే ఏం జరుగుతుందంటే?

by Jakkula.Mamatha |

ప్రస్తుతం కార్తీకమాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు తరలి వెళ్తున్నారు.

రేపే కార్తీక పౌర్ణమి.. ఆ సమయంలో దీపారాధన చేస్తే ఏం జరుగుతుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుతం కార్తీకమాసం కొనసాగుతుంది. దీంతో ఈ మాసంలో ప్రతి రోజు అధిక సంఖ్యలో భక్తులు దేవాలయాలకు తరలి వెళ్తున్నారు. ఇక, శివాలయాల్లో అయితే దీపాల కాంతులతో, శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తున్నారు. సహజంగా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని అర్చిస్తారు. కానీ.. కార్తీక మాసంలో ప్రతి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. ఈ తరుణంలో మహిళలందరూ ఎదురుచూస్తున్న కార్తీక పౌర్ణమి ఈ ఏడాది నవంబర్ 05వ తేదీన వచ్చింది. అంటే.. రేపే కార్తీక పౌర్ణమి.

ఈ రోజు చాలా విశిష్టమైన రోజు కాబట్టి కొన్ని ఆచారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఈ తరుణంలో దేవాలయంలో కానీ, రావి లేదా తులసి చెట్టు వద్ద గానీ, నదీతీరంలో 365 వత్తులతో దీపారాధన చేస్తే మంచిదని పురణాలు చెబుతున్నాయి. అంతేకాదు.. పగలంతా ఉపవాసం ఉండి.. సూర్యాస్తమయంలో దీపారాధన చేసి.. పరమేశ్వరుడిని.. విష్ణుమూర్తిని పూజించాలి. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధన గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి.

ఈ రోజు(మంగళవారం) రాత్రి 10:30 గంటల నుంచి రేపు సాయంత్రం 6:48 గంటల వరకు తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు(బుధవారం) వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉదయం 4:52 నుంచి 5:44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సాయంత్రం 5:15 నుంచి 7:05 గంటల వరకు దీపారాధన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ సమయంలో మనసులో ఏదైనా కోరిక కోరుకుని దీపారాధన చేస్తే అది నేరవేరుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.

Next Story