Kumbha Mela 2025 : కుంభమేళా అంటే ఏంటి ? అసలు, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?

by Phanindra |   (  Updated:2025-01-25 03:26:58  IST  )

కుంభమేళా పెద్ద పండుగ.

Kumbha Mela 2025 : కుంభమేళా అంటే ఏంటి ? అసలు, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు?
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూ పురాణాల ప్రకారం, కుంభమేళా ( Kumbha Mela 2025 ) పెద్ద పండుగ. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క కదలికల పై ఆధారపడి ఉంటుంది. కుంభమేళా అనేది ఒక వేడుక మాత్రమే కాదు. ఇది, మోక్షాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజలకు ఆధ్యాత్మిక సమాజం. ఇప్పటి వరకు తెలిసి, తెలియక చేసిన తప్పులకు ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే విముక్తి కలుగుతుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పండుగలలో ఒకటిగా నిలిచింది. కుంభ మేళాను ఎందుకు జరుపుకుంటారు? ఇవి ఎన్ని రకాలో ఇక్కడ తెలుసుకుందాం..

కుంభమేళా లో మొత్తం నాలుగు రకాలు ఉంటాయి.

1. కుంభ మేళా : ఇది నాలుగు సంవత్సరాల కొకసారి వస్తుంది.

2. అర్థ కుంభ మేళా : ఇది ఆరు సంవత్సరాల కొకసారి వస్తుంది.

3. పూర్ణ కుంభ మేళా : ఇది 12 ఏళ్లకు కొకసారి వస్తుంది.

4. మహా కుంభ మేళా : ఇది అన్నింటి కంటే పెద్ద కుంభ మేళా.. 144 ఏళ్లకు కొకసారి వస్తుంది.

అసలు, ఈ కుంభ మేళాను ఎందుకు జరుపుకుంటారంటే..?

దేవతలకు, అసురులకు మధ్యలో అమృతం కోసం 12 రోజులు యుద్ధం జరుగుతుంది. దేవతలకు 12 ఏళ్ళు అంటే మనకీ పన్నెండు సంవత్సరాలు అని అర్ధం. ఆ యుద్ధం జరిగే సమయంలో నాలుగు అమృత చుక్కలు భూమిపై ఉన్న నాసిక్ , హరిద్వార్ , ప్రయోగ్రాజ్ , ఉజ్జయిని లో పడతాయి. అందు వలన ఈ ప్రదేశాలలో కుంభ మేళాను చేస్తారు. ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story