- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? మరీ వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండిలా
ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని కోరుకుంటాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి హిందువు తన జీవితంలో ఒక్కసారైనా అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra) వెళ్లాలని కోరుకుంటాడు. హిమాలయ పర్వతాల్లో సహజసిద్ధంగా ఏర్పడే ఆ మంచు లింగాన్ని దర్శించుకుని తన జన్మ ధన్యం చేసుకోవాలనుకుంటాడు. అందుకే ఈ ప్రయాణం ఎంత కష్టమైనదైనా కూడా ఆనందంగా ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ప్రతి ఏడాది అమర్ నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ఇక ఈ ఏడాది జూలై 25 నుంచి ఆగస్టు 19 వరకు అమర్‌నాథ్ సాగనుంది. అయితే, ఈ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ సందర్భంగా శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్ర బోర్డు (SASB) ఈనెల 14 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకోండిలా..
* యాత్రకు వెళ్లే భక్తులు ముందుగా అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు అధికారిక వెబ్‌సైటు https://jksasb.nic.in/ ను ఓపెన్ చేయాలి.
* 'ఆన్‌లైన్ సేవలు' ట్యాబ్‌పై క్లిక్ చేసి, 'యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్' ఎంచుకోవాలి.
* అన్ని నిబంధనలను చదివిన తర్వాత 'I Agree' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
* ఆ తర్వాత 'రిజిస్టర్' బటన్‌ను ఎంచుకోవాలి.
* పేరు, యాత్ర తేదీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మొదలైన వివరాలను నమోదు చేయాలి.
* పాస్ పోర్టు సైజ్ ఫోటోతో పాటు తప్పనిసరిగా మీ ఆరోగ్య ధృవీకరణ పత్రం (CHC)ను అప్‌లోడ్ చేయాలి.
* మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.
* ఆ తర్వాత రెండు గంటల్లోపు అమర్‌నాథ్ యాత్రకు రుసుము కట్టమని లింక్ వస్తుంది.
* రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 150 డిపాజిట్ చేయాలి. సమయాన్ని బట్టి ఈ రిజిస్ట్రేషన్ ఫీజులలో మార్పులు ఉండొచ్చు.
ఆఫ్‌లైన్‌లో అమర్‌నాథ్ యాత్రకు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే.. మీరు బ్యాంకు నుంచి ట్రావెల్ ఫారమ్ తీసుకోవాలి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, జమ్మూ కాశ్మీర్ బ్యాంక్, యస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్‌లలో దీనిని సులభంగా పొందవచ్చు. అక్కడ మీరు మెడికల్ రిపోర్ట్‌ని చూపించి.. వారు ఇచ్చే ఫారమ్‌ని నింపి ప్రయాణానికి అనుమతి తీసుకోవచ్చు. అలాగే, మెడికల్ రిపోర్ట్ లేకుండా మీరు అమర్‌నాథ్ యాత్ర చేసేందుకు అనుమతి లభించదు. అలా అని మీరు మీ వైద్యుల నుంచి ఈ సర్టిఫికెట్ తెస్తే కుదరదు. SASB వెబ్‌సైట్‌లో ఏ ఆస్పత్రిలో ఏ వైద్యుల దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికెట్ తీసుకోవాలో లిస్ట్ ఉంటుంది






