- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సఫల ఏకాదశి రోజు విష్ణువును ఇలా పూజిస్తే దీర్ఘాయుష్షు
by Naga Rani Yarlagadda |
సఫల ఏకాదశి.. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సఫల ఏకాదశి.. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ ఉపవాసం వ్యాపారం, ఉద్యోగం, పిల్లలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేక ప్రయోజాలను తెస్తుంది. ఏకాదశి తిథి డిసెంబర్ 14న సాయంత్రం 6.49 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 15న రాత్రి వరకూ ఉంటుంది. డిసెంబర్ 15 సఫల ఏకాదశి చెల్లుతుందని పండితులు తెలిపారు.
ఈ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించాలి. ఉపవాసం చేపట్టి సాయంత్రానికి నుదిటిపై గంధపు తిలకాన్ని ధరించాలి. విష్ణువును పువ్వులతో అలంకరించి.. పంచామృతం లేదా పండ్లను సమర్పించాలి. తులసి ఆకులతో పూజించాలి. ఉపవాసాన్ని విడిచే ముందు నీటిలో దీపాన్ని వెలిగించాలి. ఆహారం, బట్టలు దానం చేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు కలుగుతాయి.
Next Story






