- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijayawada Kanakadurgamma: వాట్సాప్‌లో విజయవాడ కనకదుర్గమ్మ సేవలు.. బుక్ చేసుకోండిలా
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం 'మన మిత్ర' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం 'మన మిత్ర' పేరుతో వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందు కోసం 95523 00009 వాట్సాప్ నంబరును కూడా కేటాయించింది. ఈ నంబర్‌కు మేసేజ్ చేసి మనకు కావాల్సిన సేవలను మనం పొందవచ్చు. అయితే, ఈ వాట్సాప్ నంబర్ ద్వారా రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయం సేవల్ని కూడా పొందవచ్చని దేవాదాయ శాఖ తెలిపింది. దుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు ఆర్జిత సేవ, విరాళం, దర్శన టిక్కెట్ల బుకింగ్‌లను సులభతరం చేస్తూ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాట్సాప్ సేవల్ని భక్తులు వినియోగించుకోవాలని సూచించింది.
ఎలా బుక్ చేసుకోవాలంటే..
* ముందుగా వాట్సాప్‌లో 9552300009 నంబరుకు 'Hi' అని మెస్సేజ్ చేయాలి.
* 'Choose Service' సేవలు ఎంచుకోవాలి.
* ఆప్షన్‌లో టెంపుల్ బుకింగ్ సర్వీసేస్‌ను (Temple Booking Services) ఎంచుకోవాలి.
* విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానంలోని ఆలయ దర్శనం, టెంపుల్ సేవ, విరాళంలో కావాల్సి ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* సేవల పట్టికలో కావలసిన సేవ ఉదాహరణకు.. అష్టోత్తర నామార్చన సేవను బుక్ చేసుకుంటే టైం స్లాట్‌ను ఎంచుకొని, continue బటన్‌ను నొక్కాలి.
* ఎంత మంది హాజరు అవుతున్నారో ఎంపిక చేసుకొని, వారి పేరు, ఆధార్ లేదా ఇతర id వివరాలు, గోత్రం, పుట్టినతేదీ వివరాలు పొందుపరచి, కంటిన్యూ నొక్కాలి.
* వ్యక్తుల, పూజా, రుసుము వివరాలు సరిచూసుకొని కన్ఫమ్ చేసి పేమెంట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* పేమెంట్ పద్దతిని ఎంచుకుని, తరువాత వచ్చే ఆప్షన్‌ను ఎంచుకుని పేమెంట్ చేయాలి.
* పేమెంట్ పూర్తయిన తరువాత బుక్ చేయాల్సిన టికెట్ భక్తులకు వాట్సాప్‌లో వస్తుంది.
* భక్తులు ఈ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
* ఈ వాట్సాప్ సేవలు తెలుగు, ఇంగ్లీషు రెండు భాషల్లో అందుబాటులో ఉన్నాయి.






