చార్‌ధామ్‌లో తొలిసారి మెగా పూజ.. రుసుమెంతో తెలుసా ?

by Naga Rani Yarlagadda |

చార్ ధామ్ యాత్రలో పూజలు చేయించుకునే భక్తులకు BKTC షాకిచ్చింది . ఈసారి ఏకంగా రూ.11 లక్షల పూజను అందుబాటులోకి తీసుకొచ్చింది.

చార్‌ధామ్‌లో తొలిసారి మెగా పూజ.. రుసుమెంతో తెలుసా ?
X

దిశ, వెబ్‌డెస్క్: చార్ ధామ్ యాత్ర మరికొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బద్రీనాథ్, కేదార్ నాథ్ టెంపుల్స్ కమిటీ (BKTC) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయాల్లో సాధారణ, ప్రత్యేక పూజల రుసుములను 5-10 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనితోపాటు రూ.11 లక్షల విలువైన ప్రత్యేక మెగా స్పెషల్ పూజ కోసం ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ పూజలు చేయించుకోవాలనుకునే భక్తులకు అన్నీ కలిపి మెజా స్పెషల్ పూజ అనే ప్యాకేజీని రూపొందించినట్లు తెలిపింది. పూజల ద్వారా వచ్చే డబ్బులను ఆలయాల నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తామని బీకేటీసీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది వెల్లడించారు. గతంలో ప్రతి పూజను విడివిడిగా బుక్ చేసుకోవాల్సి ఉండేదని, ఈ ప్రక్రియ యాత్రికులకు తరచూ ఇబ్బంది అవుతోందనే భక్తుల కోరిక మేరకు అన్ని పూజల్ని ఒకే మాడ్యూల్ ద్వారా పొందేందుకు వీలుగా ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఏప్రిల్ 19 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 22న కేదార్ నాథ్, 23న ఉదయం 6.15 గంటలకు బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరచుకుంటాయి.

Next Story