- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూలైన్
తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండి..

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో (Tirumala) భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండి.. శిలాతోరణం వరకూ క్యూ లైన్ ఉన్నట్లు టీటీడీ (TTD) తెలిపింది. ఇప్పటికే క్యూలైన్లో ఉండి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం జరిగేందుకు 18 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కొత్తగా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది.
టైమ్ స్లాట్ టోకెన్లు (Time Slot Tokens) ఉన్న భక్తులకు సర్వదర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని, రూ.300 స్పెషల్ దర్శనానికి సుమారు 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. నిన్న (బుధవారం) 68,213 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.2.86 కోట్లు వచ్చింది. 29,410 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు ఆర్జిత సేవా కోటా విడుదల
డిసెంబరు నెలకు సంబంధించిన స్వామివారి ఆర్జిత సేవల కోటాను ఈరోజు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకూ భక్తులు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సెప్టెంబర్ 22న మధ్యాహ్నంలోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఇక శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను సెప్టెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల కోటా, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఫ్రీ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేస్తారు. 24న ఉదయం 10 గంటలకు రూ.300 టికెట్ల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు అద్దె గదుల బుకింగ్ కోటా అందుబాటులో ఉండనుంది.






