- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారంరోజుల్లో ఒంటిమిట్ట శ్రీ రాములవారి కల్యాణం.. శాస్త్రోక్తంగా తలంబ్రాల తయారీ
ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం కోసం టీటీడీ శాస్త్రోక్తంగా తలంబ్రాలను తయారీ చేయించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి కడపజిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ఉత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి ధ్వజారోహణ ఘట్టాన్ని నిర్వహించారు. కాగా.. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి సీతారామచంద్రులవారికి కల్యాణం జరగనుండగా.. ఈ కల్యాణం కోసం టీటీడీ తలంబ్రాల ప్యాకింగ్ ను శాస్త్రోక్తంగా ప్రారంభించింది. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేసి, ఒక్కో ప్యాకెట్ లో ఒక ముత్యం, కంకణాన్ని ఉంచి 1.60 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






