Today's Horoscopes : ఈ రోజు రాశిఫలాలు ( March 24 )

by Batti.Sumithra |

ఈ రోజు ఏయే రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

Todays Horoscopes : ఈ రోజు రాశిఫలాలు ( March 24 )
X

మేష రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఉత్సాహంగా ఉంటారు. ఆర్ధిక విషయాల గురించి జీవిత భాగస్వామితో కలిసి ప్లాన్ చేస్తారు. ప్రేమ వ్యవహారంలో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. కార్యాలయంలోని పనిలో వచ్చే మార్పులు మీకు ఉపయోగపడతాయి.

వృషభ రాశి

ఈ రోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు చేయడానికి మంచి రోజు. కానీ డబ్బు విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలి. పాత స్నేహాలను, బంధువులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహార విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సమస్యలతో కార్యాలయంలో పని పై ఫోకస్ తగ్గొచ్చు.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారు స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. ఇంటి పనుల వల్ల ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. దూరపు బంధువులతో చిన్న చిన్న తగాదాలు ఉండే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారంలో కాస్త జాగ్రత్త వహించాలి. విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు.

కర్కాటక రాశి

కుటుంబంతో టైమ్ గడపడం వల్ల మనసుకు శాంతి కలుగుతుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి. మీ సమస్యలు ఇంట్లో చెప్పుకుంటే మంచిది. ఉద్యోగంలో మీ పనిని గుర్తిస్తారు. భాగస్వామి ఈ రోజు చాలా కేర్ తీసుకుంటారు.

సింహ రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై జాగ్రత్త వహించడం అవసరం. పాత బకాయిలు వసూలు అవుతాయి. అలాగే ఖర్చులు కూడా అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాటల్లో కాస్త కఠినత ఉండొచ్చు. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. ఇంట్లో చిన్న సమస్యలు వచ్చినా మీరు సర్దుకుంటారు.

కన్య రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యానికి హాని చేసే అలవాట్లు మానేయడం మంచిది. ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల సహకారం బాగుంటుంది. భాగస్వామితో మంచి సాయంత్రం గడుపుతారు.

తుల రాశి

ఈ రోజు ఈ రాశి వారు డబ్బు ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. పెద్దలతో మాట్లాడేటప్పుడు మాటలు జాగ్రత్తగా వాడాలి. సాయంత్రం స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. కొంతమంది మాటలు మీకు కాస్త బాధ కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య ఖర్చుల విషయమై చిన్న గొడవలు తలెత్తవచ్చు.

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు తగ్గించడం మంచిది. పాత బకాయిలు వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వలన కాస్త శాంతి పొందుతారు. ప్రేమలో మంచి అనుభూతి ఉంటుంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి మంచి రోజు.

ధనుస్సు రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం తర్వాత ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ఆఫీస్‌లో శత్రువుగా అనుకున్నవాడు నిజానికి మీకు మంచివాడని తెలుస్తుంది. భాగస్వామితో చిన్న అపార్థాలు రావచ్చు.

మకర రాశి

ఈ రోజు ఈ రాశి వారు పిల్లల విషయాలలో ఆనందంగా ఉంటారు. ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉంటాయి. కుటుంబంలో సమస్యలు వచ్చినా శాంతిగా పరిష్కరించండి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా చేయడం మంచిది. ఆర్ధిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఉద్యోగ అవకాశాలకు మంచి రోజు. చాలా రోజుల తర్వాత ఆనందంగా గడుపుతారు.

మీన రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆరోగ్యం పై జాగ్రత్త వహించడం అవసరం. పాతబకాయిలు వసూలు అయినా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడొచ్చు. కార్యాలయంలో సానుకూలత ఉంటుంది.

Next Story