- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Today's Horoscope : ఈ రోజు రాశి ఫలాలు
ఈ రోజు ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారు క్రీడలు, ఫిట్‌నెస్ విషయాల్లో ఆసక్తి చూపుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వీరికి లాభాలు కలిగించవచ్చు. కానీ ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గిస్తే మంచిది. కార్యాలయంలో మీ పని మీదే దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు దైవారాధన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. బంధువులను చూసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి డబ్బు విలువ బాగా అర్థమవుతుంది. అవసరం లేని ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో సమయం గడుపుతారు. ఉద్యోగంలో కొంచెం ఒత్తిడి ఉన్నా పనులు పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్న వ్యాపారాలు చేసే వారికి లాభాలు సమకూరుతాయి. కుటుంబంతో అనుబంధం పెరుగుతుంది. పిల్లలకు తగిన సమయం ఇచ్చి వారిని ఆనందంగా ఉంచుతారు. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారు కోపం నియంత్రణలో పెట్టుకోవాలి. కొంత ధనాన్ని కుటుంబ అవసరాల కోసం సేవ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యులు సపోర్ట్ తో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ విషయంలో కొత్త వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలి.
కన్య రాశి
ఈ రోజు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. డబ్బు అప్పుగా ఇవ్వడం వల్ల కాస్త ఇబ్బంది రావచ్చు. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో కాస్త చిక్కులు ఎదురు కావచ్చు. ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశాలు రావచ్చు.
తుల రాశి
ఈ రోజు ఈ రాశి వారు అవసరం లేని విషయాలకు దూరంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది. స్నేహితులతో, సన్నిహితులతో మంచి సమయం గడుపుతారు. కార్యాలయంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారు యోగా లేదా ధ్యానంతో మొదలుపెడితే మంచిది. విదేశీ వ్యాపారాలు లేదా అవకాశాలు కలిసివస్తాయి. మీ పనులకు ఆటంకం కలిగించే వాళ్లతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శాంతి ఉంటుంది.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారు కొన్ని సమస్యలను ఓపికతో పరిష్కరించుకోగలుగుతారు. డబ్బు విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంతో కలిసి సమయం గడపడం మంచిది. కష్టపడితే అనుకున్న లక్ష్యాలు చేరుకుంటారు.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆర్ధిక సమస్యలు కూడా ఎదురవచ్చు. కుటుంబ సభ్యులతో మాట్లాడితే కాస్త ఊరట కలుగుతుంది. ఉద్యోగంలో కొంత పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న తగవులు తగ్గే అవకాశం ఉంది.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం అవసరం. పెట్టుబడులు ఆలోచించి పెట్టాలి. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగంలో సహచరుల సహాయం ఉంటుంది. మీకు మీకోసం టైమ్ దొరుకుతుంది.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. ఇంటి అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో పెండింగ్ పనులు పూర్తి చేయాలి.






