Today's Horoscope : ఈ రోజు రాశి ఫలాలు

by Batti.Sumithra |

ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Todays Horoscope : ఈ రోజు రాశి ఫలాలు
X

మేష రాశి

ఈ రాశి వారికి ఈరోజు పెద్దల సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో సమయాన్ని గడపగలుగుతారు. డ్రైవింగ్‌లో చేసే సమయంలో జాగ్రత్తలు అవసరం. మీ పనులు సజావుగా పూర్తి అవుతాయి. ఖాళీ సమయంలో మీకు ఇష్టమైన పనులు చేస్తారు.

వృషభ రాశి

ఈ రోజు ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహోదరుల నుంచి సహాయం లభిస్తుంది. కుటుంబంతో సమయం గడుపుతారు. కార్యాలయంలో ఒత్తిల్లతో టెన్షన్స్ కొంచెం పెరుగుతుంది. ఖాళీ సమయంలో ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత వస్తుంది.

మిథున రాశి

ఈ రోజు ఈ రాశి వారు అందం, ఆరోగ్యం మీద శ్రద్ద చూపిస్తారు. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టడం మంచిది. మంచి శుభవార్త వింటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కార్యాలయంలో శత్రువులు తగ్గుతారు. ఇంటి పనుల్లో సమయం గడుస్తుంది.

కర్కాటక రాశి

ఈ రోజు ఈ రాశి వారికి టెన్షన్ తగ్గుతుంది. ఖర్చులు అధికమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబంతో సరదాగా సమయాన్ని గుడుపుతారు. ప్రేమ వ్యవహారంలో కాస్త నిరాశ ఉండొచ్చు. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ప్లాన్ చేసిన పనులు ఆలస్యమవుతాయి.

సింహ రాశి

ఈ రోజు ఈ రాశి వారికి అన్ని విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. సన్నిహితులు మంచి సలహా ఇస్తారు. పని ఒత్తిడి ఉన్నా పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు చదువు పై ఫోకస్ తగ్గొచ్చు.

కన్య రాశి

ఈ రోజు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపి ఒంటరితనాన్ని తగ్గించుకుంటారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీరు అనుకుని చేసిన అన్ని పనులు విజయాన్ని సాధిస్తాయి. ఒక ప్రత్యేక వ్యక్తి మీపై దృష్టి పెడతారు. సమయం వృథా చేయకుండా జాగ్రత్త వహించాలి.

తులా రాశి

ఈ రోజు ఈ రాశి వారు ధైర్యంతో సమస్యలను ఎదుర్కొంటారు. డబ్బు సేవింగ్ చేయగలుగుతారు. పిల్లల వల్ల ఆనందం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో చిన్న గొడవలు వస్తాయి. విద్యార్థులు టైమ్ వృథా చేసే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి

ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న పనులు చేయడానికి మంచి రోజు. పిల్లల వల్ల లాభం ఉంటుంది. ప్రేమలో కొంత వ్యవహారంలో కాస్త చికాకులు తలెత్తుతాయి. కొత్త అవకాశాలు వస్తాయి కానీ త్వరగా నిర్ణయం తీసుకోకండి. వైవాహిక జీవితం మెరుగుపడుతుంది.

ధనుస్సు రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహిస్తారు. ఖర్చులు నియంత్రించాలి. చిన్న చిన్న ప్రయాణాలు ప్రశాంతతను కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారంలో చిన్న గొడవలు ఉంటాయి. పనులు ఆలస్యమవుతాయి. టైమ్ వృథా కాకుండా చూసుకోండి.

మకర రాశి

ఈ రోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. డబ్బు సమస్యలు ఉంటే నమ్మకమైనవారిని సంప్రదించండి. బంధువులతో సమయం గడపడం మంచిది. ప్రేమ విషయాల్లో మంచి మార్పులు ఉంటాయి. మొదట అలసటగా ఉన్నా తర్వాత రోజు బాగుంటుంది.

కుంభ రాశి

ఈ రోజు ఈ రాశి వారు భావోద్వేగాలను కంట్రోల్‌లో ఉంచాలి. పాత ఆలోచనలు వదిలేయండి. ఇంటి మీద పెట్టుబడి మంచిది. ఫ్రెండ్స్‌తో పార్టీ ప్లాన్ చేస్తారు. పెండింగ్ పనులు పూర్తి చేయాలి. భాగస్వామితో టైమ్ గడిపితే ఆనందం. కానీ చిన్న విభేదాలు రావచ్చు.

మీన రాశి

ఈ రోజు ఈ రాశి వారు వారిపై వారు నమ్మకం పెట్టుకోవాలి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఇంట్లో, ఫ్రెండ్స్ మధ్య మీ గౌరవం పెరుగుతుంది. ఇది మీకు మంచి రోజు. ఆఫీసులో తెలివిగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి.

Next Story