- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

మేష రాశి
ఈ రోజు ఈ రాశి వారికి పనిభారం వల్ల కొంత చిరాకు రావచ్చు. ఆర్థికంగా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇంటి విషయాల్లో చిన్నచిన్న ఇబ్బందులు రావచ్చు. మీకు ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి వార్తలు వింటారు. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సమస్యలకు వెంటనే స్పందించడంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది.
వృషభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు జీవిత భాగస్వామితో సమయం ఎక్కువగా గడపుతారు. పిల్లల ద్వారా ఆర్థిక లాభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ప్లాన్ చేసిన మీటింగ్స్ లేదా డేట్స్ కొంచెం నిరాశ కలిగించవచ్చు. సమయాన్ని వృథా చేయకుండా జాగ్రత్తపడండి. అధిక ఆశలు వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారి ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. మీరు బయట ఇచ్చిన ధనం ఈ రోజు తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. స్నేహితులతో ఈ రోజు సరదాగా సమయాన్ని గడుపుతారు. ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.
కర్కాటక రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆరోగ్యం పై జాగ్రత్త వహించడం అవసరం. రియల్ ఎస్టేట్‌లో రంగాలలో పెట్టే పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు అటు చదువులోపూ, ఇటు ఆటలలోనూ రెండింటిలో ప్రావీణ్యం చూపుతారు. ఇంటి బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. డాక్యుమెంట్ లపై సంతకాలు చేసే పరిస్థితి ఏర్పడితే పరిశీలించి అడుగువేయడం మంచిది. దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి.
సింహ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఆనందంగా సమయాన్ని గడుపుతారు. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంటి సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ప్రేమ వ్యవహారంలో చిన్న అపార్థాలు రావచ్చు. కార్యాలయంలో పై అధికారులను సంతృప్తి పరచాలంటే పని పై ఫోకస్ అవసరం.
కన్యా రాశి
ఈ రోజు ఈ రాశి వారు అనేక సమస్యలు ఉన్నా నవ్వుతూ ఎదుర్కొంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభాలను తెస్తాయి. చిన్న ట్రిప్ రిలాక్స్ ఇస్తుంది. ప్రేమలో ఒత్తిడి తీసుకోకండి. కొత్త భాగస్వామ్యాలు మంచివి. మీకోసం సమయం దొరుకుతుంది. జీవిత భాగస్వామికి ప్రాధాన్యం ఇవ్వాలి.
తులా రాశి
ఈ రోజు ఈ రాశి వారికి ఆధ్యాత్మిక విషయాల పై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. సోదరుల సహాయం లభిస్తుంది. పనిలో సీనియర్లు మెచ్చుకుంటారు. ఎదురు చూస్తున్న మంచి వార్త రావచ్చు. భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
వృశ్చిక రాశి
ఈ రోజు ఈ రాశి వారు గతాన్ని మర్చిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులను తగ్గించడం మంచిది. మీ పనుల పై దృష్టి పెట్టండి. ప్రేమలో జాగ్రత్తగా మాట్లాడాలి. పెద్దలను గౌరవించాలి. మీకోసం సమయం దొరుకుతుంది. భాగస్వామితో చిన్న విభేదాలు రావచ్చు.
ధనుస్సు రాశి
ఈ రోజు ఈ రాశి వారు పనులు త్వరగా పూర్తి చేస్తారు. పాత స్నేహితులు సహాయం అడగవచ్చు. పాత సంబంధాలు మళ్లీ బలపడతాయి. ప్రేమలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆఫీసులో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. భాగస్వామి మీకు సర్‌ప్రైజ్ ఇస్తారు.
మకర రాశి
ఈ రోజు ఈ రాశి వారు భావోద్వేగాలను నియంత్రించాలి. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు అనుకూలం. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ప్రేమలో లోతైన భావనలు అర్థమవుతాయి. వ్యాపార ఒప్పందాలు జాగ్రత్తగా చేయాలి. ఆధ్యాత్మికంగా ఆలోచించడం మంచిది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
కుంభ రాశి
ఈ రోజు ఈ రాశి వారు ఇతరుల కోసం ఎక్కువ బాధ్యతలు తీసుకోకండి. అప్పుల విషయంలో జాగ్రత్త. స్నేహితులతో బయటకు వెళితే రిలీఫ్ కలుగుతుంది. సంబంధాలు మెరుగుపడతాయి. సహోద్యోగుల సహాయం ఉంటుంది. సమయం వృథా కాకుండా చూసుకోండి.
మీన రాశి
ఈ రోజు ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచాలి. ఆందోళనలు ఆరోగ్యం పై ప్రభావం చూపవచ్చు. ఆర్థిక లాభాలు వస్తాయి, దానం చేయాలనిపిస్తుంది. కుటుంబంలో టెన్షన్లు రావచ్చు. ఆఫీసులో పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఇతరులకు సహాయం చేస్తారు. భాగస్వామి సహకారం లభిస్తుంది.






