Today's Horoscope (April 30) : ఈరోజు ఆ ఆరు రాశుల వారికి శుభ సూచనలు

by Batti.Sumithra |

పన్నెండు రాశుల వారికి ఇవాళ (ఏప్రిల్ 30 )ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. ఏ రాశుల వారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది, ఎవరి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఎవరికి జాగ్రత్త అవసరమో తెలుసుకుందాం.

Todays Horoscope (April 30) : ఈరోజు ఆ ఆరు రాశుల వారికి శుభ సూచనలు
X

పన్నెండు రాశుల వారికి ఇవాళ (ఏప్రిల్ 30 )ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం. ఏ రాశుల వారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది, ఎవరి ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, ఎవరికి జాగ్రత్త అవసరమో తెలుసుకుందాం.

మేష రాశి

ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కెరీర్‌లో ముందడుగు పడుతుంది. వ్యాపారులకు లాభాలు రావచ్చు. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. గౌరవం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

వృషభ రాశి

గురు గ్రహ ప్రభావంతో మంచి ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సాఫీగా పూర్తవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశముంది. వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది.

మిథున రాశి

ఈ రోజు మీకు శుభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి

మొత్తంగా మంచి ఫలితాలు ఉన్నా ఉద్యోగులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. పెట్టుబడులకు అనుకూల సమయం. బకాయిలు వసూలు అయ్యే అవకాశం ఉంది.

సింహ రాశి

అత్యంత అనుకూలమైన రోజు. ఉద్యోగాల్లో ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయావకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి.

కన్య రాశి

పలు రంగాల్లో విజయాలు సాధించవచ్చు. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. బ్యాంకింగ్, మార్కెటింగ్ రంగాల వారికి ఇది మంచి రోజు. విద్యార్థులు రాణిస్తారు. కుటుంబం, ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది.

తులా రాశి

మీ ప్రయత్నాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామి సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అయితే కొంత ఖర్చులు పెరగొచ్చు. కెరీర్‌లో పురోగతి కనిపిస్తుంది.

వృశ్చిక రాశి

ఈ రోజు మంచి ఫలితాలు ఇస్తుంది. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి

కొంత ప్రతికూలత ఉండొచ్చు. ప్రయాణాల్లో, వాహన వినియోగంలో జాగ్రత్త అవసరం. పనులు ఆలస్యం కావచ్చు. స్నేహితులతో విభేదాలు రావచ్చు. వ్యాపారంలో నష్టం తలెత్తే అవకాశం ఉంది.

మకర రాశి

గురు అనుగ్రహంతో మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వివాహ సంబంధ అడ్డంకులు తొలగే సూచనలు ఉన్నాయి.

కుంభ రాశి

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నిసార్లు అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు తీర్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

మీన రాశి

ఆర్థికంగా లాభదాయకమైన రోజు. ఉద్యోగాల్లో ప్రమోషన్ లేదా శుభవార్తలు రావచ్చు. అధికారుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఖర్చులను నియంత్రిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు.

Next Story